పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామంలో రూ.16.50 కోట్లతో వ్యయంతో చేపడుతున్న కొత్తపాలెం, బేతపూడి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి బుధవారం రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శంఖుస్థాపన చేసారు. శేరేపాలెం గ్రామంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డ్వాక్రా భవనాన్ని 11.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మినీ కమ్యునిటీ ప్రొడక్షన్ సెంటర్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. మొగల్తూరు మండలం మోడీలో దర్భరేవు డ్రైన్లపై 10 కోట్ల నిధులతో మొగల్తూరు మోడీ గ్రామాల మధ్య ఉప్పుటేరుపై వంతెన నిర్మాణ పనులకు లోకేష్ శంకుస్థాపన చేపారు. నరసాపురం మండలం బియ్యపు తిప్ప గ్రామంలో 13.58 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఫిషింగ్ ఆర్భర్ నిర్మాణ పనుకు బుధవారం మంత్రి లోకేష్ శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో రాష్టమంత్రి పితాని సత్యనారాయణ, కొల్లు రవీంధ్ర, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలఝక్ష్మి, జెడ్ సి ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, శాసన సభ్యుడు బండారు మాధవనాయుడు , రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.