ప్రపంచ వ్యాప్తంగా యువత మొదలుకుని పెద్దోళ్ల వరకు బాధపడే ఏకైక సమస్య బరువు. పొట్ట ఎక్కువగా రావడంతో దాన్ని తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఉదయం నిద్రలేచింది మొదలుకుని రాత్రయ్యే వరకు చాలా మంది జిమ్‌లు, పార్కులు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే వాటివల్ల బరువు తగ్గుతారు అందులో ఎలాంటి అపోహ లేదు. కానీ అదే డైట్, జిమ్‌ను ఫాలో అయితే సరే లేకుంటే మళ్లీ వ్యవహారం మొదటికొస్తుంది. అయితే తాజాగా జపాన్‌కు కియూషు యూనివర్శిటీలో బరువు ఎలా తగ్గాలి? ఎలాంటి కష్టం లేకుండా సులభంగా బరువు తగ్గడమెలా? అనే దానిపై పరిశోధనలు చేశారు. ఆఖరికి తేలిందేంటో మీరే చూడండి.. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా అక్షర సత్యమేనని పరిశోధుకులు తేల్లచేశారు.
పరిశోధన ఇలా సాగింది..
చాలా మంది అన్నం తినడానికి కూర్చుకున్న మూడే మూడు నిమిషాల్లో ముగించేస్తారు. అన్నం దగ్గర కూర్చుంది మొదలుకుని హడావుడిగా తినేసి పరుగులు తీస్తుంటారు. అయితే అలా కాకుండా ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం (మింగడం) వల్ల చాలా బరువు తగ్గవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ విషయంపైనే జపాన్‌లో నెమ్మదిగా, వేగంగా ఆహారం తినేవారు 60వేల మంది దేశీయులను పరిశీలించారు. ఆరోగ్యం, జీవనశైలిని, ఒబేసిటీ, ఆహారం తినే అలవాట్లు పరిగణలోనికి తీసుకుని పెట్టుకుని సుమారు ఈ సర్వే చేశారు. ఇలా సుమారు ఆరేళ్ల పాటు పరిశోధన సాగింది. ఇందులో కొందరు వేగంగా తింటున్నారని చెప్పగా, మరికొందరు నిదానంగా, మీడియంగా తినే వారిని సపరేట్ చేయగా ఆఖరికి అసలు విషయం తేలింది.
నెమ్మదిగా తినండి.. నాజూకవ్వండి!
నెమ్మదిగా తినడం వల్ల, పడుకునే రెండు గంటల ముందు భోజనం చేయడం స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చని జపాన్ పరిశోధకులు తేల్చేశారు. అంతేకాదు వేగంగా కాకుండా నెమ్మదిగా తింటే ఒబేసిటీ సమస్య దూరమవుతుందని తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు సప్టం చేశారు. కాగా పరిశోధన అనంతరం నెమ్మదిగా అన్నం నెమ్మదిగా తినడం ద్వారా 4,192 మంది బరువు తగ్గారని పరిశోధకుడు సిమన్ కార్క్ మీడియాకు వివరించారు.
మొత్తానికి చూస్తే బరువు తగ్గడానికి ఇదో సంజీవని లాంటిదని చెప్పుకోవచ్చు.! ఈ విషయం తెలియని వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో జనాలు ఉండటం గమనార్హం. అయితే ఇక నుంచి అయినా సరే పై విధంగా చేస్తే లావు కాకుండా ఉండటం మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇది ట్రై చేసి చూడండి అని పరిశోధకులు చెబుతున్నారు.