YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఫిబ్రవరి14న యూ ట్యూబ్‌ డే..

ఫిబ్రవరి14న యూ ట్యూబ్‌ డే..

-  వాలెంటైన్స్‌ డే రోజునే పరిచయమైంది

ప్రముఖ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం యూ ట్యూబ్‌ ఎపుడు  ప్రారంభమైందో తెలుసా. పే పాల్‌ మాజీ ఉద్యోగి సృప్టించిన యూ ట్యూబ్‌  వాలెంటైన్స్‌ డే రోజున ప్రపంచానికి పరిచయమైంది. ఫిబ్రవరి 14  సోమవారం,   2005లో యూ ట్యూబ్‌ను యాక్టివేట్‌ చేశారు.  ప్రస్తుతం గూగుల్‌ సొంతమైన యూ ట్యూబ్‌ 20 ఏళ్ల క్రితం  తన సేవలను ప్రారంభించింది.

ఆన్లైన్ చెల్లింపు సంస్థ  పేపాల్‌ లో పనిచేస్తున్న సమయంలో  ఛాడ్ హుర్లీ, స్టీవ్ చెన్,  జావేద్ కరీమ్  యూ ట్యూబ్‌ను స్థాపించారు. కాలిఫోర్నియా కేంద్రంగా ఫిబ్రవరి 14న యాక్టివేట్‌ అయిన  యూ ట్యూబ్‌  అదే ఏడాది ఏప్రిల్‌ 23న ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంతే...యూజర్లను ఆకట్టుకోవడంలో  శరవేగంగా దూసుకుపోయిన ఈ డొమైన్‌ ఒక సంవత్సరంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సైట్లలో ఒకటిగా నిలిచింది. 2005 నవంబరులో వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ  సీక్వోయా కాపిటల్ 3.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులుపెట్టింది. ఈ కంపెనీపార్టనర్‌, పేపాల్ మాజీ సీఎఫ్‌వో   రూల్ఫ్ బోథా, యూ ట్యూబ్‌  డైరెక్టర్స్‌ బోర్డులో చేరారు. ఎన్‌బీసీ  భాగస్వామ్యంతో  మార్కెటింగ్‌ అండ్‌ ఎడ్వర్టైజింగ్‌   వ్యాపారంలోకి  ప్రవేశించింది. ఈ నేపథ్యంలో టైమ్స్‌ మ్యాగజైన్‌ అందించే  ప్రతిష్టాత్మక పర్సన్‌ ఆఫ్‌ ఇది ఇయర్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది.  

2006 నవంబర్ లో గూగుల్ 1.65  డాలర్లతో యూ ట్యూబ్‌ను  సొంతం చేసుకుంది. తాజా  నివేదికల ప్రకారం ప్రస్తుతం సుమారు 1 బిలియన్ వినియోగదారులుండగా ఒక రోజులో 30 మిలియన్లకు పైగా ప్రజలు దీన్ని సందర్శిస్తున్నారు.

 

 

Related Posts