చంద్రబాబు మొదటి ప్రయారిటీ ఉపాధి-ఉద్యోగం. బాబు ఎక్కడ అలక్ష్యం చేసినా వీటి విషయంలో ఎపుడు నిర్లక్ష్యం చేయడం లేదు. ఎందుకంటే అది భావితరాల భవిష్యత్తు. అదేవిషయాన్ని ఇపుడు దేశమే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ తనకు ఎవరూ సాటి రారని నిరూపించుకుంది. దేశంలో ఉద్యోగార్హ నైపుణ్యాలున్న మానవ వనరులు కలిగిన రాష్ట్రంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు, మరో రెండు విషయాల్లోనూ ఏపీది మొదటి స్థానమే. పని చేసేందుకు అత్యంత అనువైన వాతావరణం అనే విభాగంలోనూ, ఉద్యోగుల నియామకానికి వివిధ కంపెనీలు మొగ్గు చూపే రాష్ట్రాల కేటగిరిలోనూ ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. అంటే ఈ మూడింటిలో ఇతర రాష్ట్రాలను వెనక్కు నెట్టేసి ఏపీ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. దీంతో చంద్రబాబు తన సత్తాను మరోసారి నిరూపించుకున్నట్టయింది.ఇండియా స్కిల్స్ రిపోర్ట్ -2019* వి. లఖ్‌నవూలో జరిగిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సులో వీటిని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, విద్యా సంస్థల లభ్యం, తల్లిదండ్రుల్లో చైతన్యం కారణంగా రాష్ట్రం ముందంజలో నిలబడింది. 2016, 2018, 2019 నివేదికల్లోను ఆంధ్రప్రదేశ్ ది మొదటి స్థానం కావడం విశేషం. 2017 మాత్రం రెండో స్థానంలో ఉంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఉద్యోగార్హ నైపుణ్యాల విషయంలో 8వ స్థానంలో నిలిచింది. పనిచేసేందుకు అనువైన వాతావరణం ఉన్న విభాగంలో ఏపీది మొదటి స్థానం. తెలంగాణది చివరి స్థానం. ఎక్కువ సంఖ్యలో ఎంపికలు-నియామకాలు జరిగిన మొదటి మూడు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు చోటు దక్కలేదు. ఈ విభాగంలో 2018లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఈసారి ఆ స్థానాన్ని మహారాష్ట్రకు వదులుకుంది.