"నిన్ను నమ్మాను. నా నమ్మకాన్ని నిలబెట్టావ్. సత్తుపల్లికి నిన్ను ఎన్నికల ఇన్ చార్జ్ గా నియమించాను. ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతోంది. వెల్ డన్ శ్రీనూ" గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు ఏపీ సీఎం చంద్రబాబు నుంచి దక్కిన అభినందన.తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి నిలబడిన సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా ఉండి, ప్రచారాన్ని పర్యవేక్షించాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు యరపతినేని అక్కడ మకాం వేశారు. ఇక నిన్న సత్తుపల్లికి వచ్చిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద యరపతినేని కలిశారు. ఈ సందర్భంగా ఆయన భుజంపై చెయ్యి వేసి అభినందించిన చంద్రబాబు, క్షేత్ర స్థాయిలో యరపతినేని వ్యూహాలు ఫలించాయని అన్నారు.