విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5,500 కోట్ల ‘అసలు’ మొత్తాన్ని చెల్లిస్తా... దయ చేసి ఒప్పుకోండని ట్వీట్లు చేస్తున్నారు. వడ్డీలతో కలుపుకుంటే భారత బ్యాంకులకు మాల్యా చెల్లించాల్సిన మొత్తం రూ.9,000 కోట్ల వరకు ఉంటుంది. అసలు మాత్రమే చెల్లిస్తానని మాల్యా గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టుకు ఈ మేరకు సెటిల్‌మెంట్ ఆఫర్ కూడా మాల్యా సమర్పించారు. అయితే వడ్డీతో సహా చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్నా మాల్యా కావాలనే నాటకాలు ఆడుతున్నారనే కారణంతో బ్యాంకులు ఆ ఆఫర్‌ను తిరస్కరించాయి.‘నా అప్పగింత నిర్ణయంపై మీడియా ఎప్పటికప్పుడు ఏదో రాస్తోంది. అయితే అది వేరే విషయం. ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుంది. ఇక్కడ అత్యంత ప్రధాన విషయం, నేను బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకున్న ప్రజల సొమ్ము. వడ్డీ లేకుండా ఆ అసలు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా. నా ఆఫర్‌ను మన్నించాలని ప్రభుత్వం, బ్యాంకులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని తాజాగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.
Respectfully to all commentators, I cannot understand how my extradition decision or the recent extradition from Dubai and my settlement offer are linked in any way. Wherever I am physically,my appeal is “Please take the money”. I want to stop the narrative that I stole money
— Vijay Mallya (@TheVijayMallya) December 6, 2018