తెలంగాణలో ఎన్నికల జోరు ఊపందుకుంది. ఇక జనం కూడా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఓటు ఎక్కడ వేయాలో కనుక్కుంటూ ఉన్నారు. అయితే ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డు(ఈపీఐసీ) లేని వాళ్లు తాము ఎలా ఓటు వేయాలో తెలియక ఆందోళనలో ఉన్నారు. ఇలాంటివారికి ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డు లేకపోయినా ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు.
1. పాస్‌పోర్ట్
2. డ్రైవింగ్ లైసెన్స్
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఐడెంటిటీ కార్డులు
4. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్స్(ఫోటో ఉండాలి)
5. పాన్ కార్డ్
6. ఎన్‌పీఆర్ ఆధ్వర్యంలో ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు
7. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డు
8. కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
9. ఫోటోగ్రాఫ్‌తో పెన్షన్ డాక్యుమెంట్
10. ఎన్నికల అధికారులు జారీ చేసిన అధికారిక ఫోటో ఓటర్ స్లిప్
11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డులు
12. ఆధార్ కార్డు