YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

పాస్ పుస్తకాల ప్రింటింగ్ షురూ..

పాస్ పుస్తకాల ప్రింటింగ్ షురూ..

దేశవ్యాప్తంగా ఏక కాలంలో మొదలైన పాస్ పుస్తకాల ముద్రణా ప్రక్రియ.భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది.  రైతులకు అందించే పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణా  ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు 
ప్రభుత్వం గవర్నమెంట్ సెక్యురిటీ ప్రింటింగ్ ప్రెస్ తో ఎంఓయూ కుదుర్చుకుంది.షార్ట్ సర్క్యులేషన్ పద్దతిలో పట్టాదారు పాసు పుస్తకం ముద్రణ ఎంఓయూకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దేశంలోని 4 సెక్యురిటీ ప్రింటింగ్ ప్రెస్ లలో పాస్ పుస్తకాల ముద్రణా మొదలైంది. వీటిల్లో  తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ తో పాటుగా  మధ్యప్రదేశ్ లోని  దేవాస్, మహారాష్ట్ర లోని నాసిక్, ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ప్రింటింగ్ ప్రెస్ లో ఈ పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రింటింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా ప్రింటింగ్ ప్రెస్ ల్లో రోజుకు రెండున్నర లక్షలకుపైగా పెద్ద ఎత్తున పాస్ పుస్తకాలను ముద్రిస్తున్నారు. మార్చి 11, 2018 కల్లా ఒక కోటీ 40 లక్షల ఎకరాల కు గానూ 70 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం చేసేందుకు కార్యాచరణనను రూపొందించారు.

పట్టాదారు పాస్ బుక్ ప్రత్యేక లక్షణాలు
పట్టాదారు పాస్ పుస్తకంపై కాకతీయుల తోరణం, చార్మినార్, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, ఎరువులు చల్లుతూ, దుక్కి దున్నుతున్న రైతుల చిత్రాలు ఉంటాయి. పాస్ పుస్తకంపై చిరు నవ్వులు చిందిస్తున్న రైతు కుటుంబాల మహిళల చిత్రాలను ముద్రిస్తారు.పట్టాదారు పాస్ పుస్తకంపై రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.,బంగారు తెలంగాణ మన స్వప్నం - మన లక్ష్యం లాంటి నినాదాల ప్రస్తావన ఉంటుంది.

18 భద్రతా ప్రమాణాలతో, పాస్ పోర్ట్ తరహాలో ముదురు ఆకుపచ్చ రంగులో మొత్తం 6 కాలమ్స్ తో, 20 పేజీలు గా పట్టాదారు పాస్ పుస్తకం తయారవుతుంది. మొత్తం 13 డిజిట్ల యూనిక్ ఐడీ లో రాష్ట్రం, గ్రామం, మండలం, జిల్లా కోడ్ లతోపాటు పాస్ బుక్ నెంబర్. ఉంటాయి. ప్రతీ పాస్ పుస్తకం యూనిక్ ఐడీలోని మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే విధంగా టీ అనే ఇంగ్లీష్ అక్షరాన్ని ప్రతేకంగా ఏర్పాటు చేశారు. యూనిక్ ఐడీలోని 6 వ స్థానంలో జిల్లాను (ఉదా: కరీంనగర్ అంటే కె ) సూచించే విధంగా ఆ జిల్లా పేరు లోని మొదటి ఇంగ్లీష్ అక్షరాన్ని పొందుపరుస్తారు. ఆధార్ అనుసంధానంతో పాస్ బుక్ పై బార్ కోడ్, క్యూఆర్ కోడ్, పట్టాదారు చేతి వేలిముద్రల ఫోటో లతోపాటుగా  పాస్ బుక్ లో పట్టాదారు మొబైల్ నెంబర్, బ్యాంక్  అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు ఉంటాయి. రైతు ఆస్తులకు సంబంధించి హద్దులతో కూడిన పట్టాదారు భూమి మ్యాప్, లావాదేవీలు, క్రయ విక్రయాల వివరాలను కూడా పొందుపరుస్తారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం పక్కా గణాంకాలు, భూ యజమానుల ఫోటోలు, ఆధార్ వివరాలను ఇప్పటికే రెవెన్యూ సేకరించారు..

Related Posts