YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజకీయాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా కుష్బూ..!!

రాజకీయాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా కుష్బూ..!!

కుష్బూ... తమిళ, తెలుగు, మలయాళ, హిందీ బాషలలో ఒక వెలుగు వెలిగిన అలనాటి తార. 1986 లో వెంకటేష్ జోడిగా 'కలియుగ పాండవులతో' తెలుగులో అడుగు పెట్టింది. ఆమె దాదాపు అన్ని బాషలలో కలిపి 200 పైగా చిత్రాలలో నటించారు. ఆమెకు తమిళనాడులో చాలా ఫాలోయింగ్ ఉంది.. ఎంత ఫాలోయింగ్ అంటే  ఆమెకు ప్రేక్షకులు గుడి కూడా కట్టారు. ఆమె తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ ఆఖరి చిత్రం 'ఆజ్ఞతవాసి' లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సినిమాలలో ప్రధాన పాత్ర పోషించే ఆమె ఆఫర్లు రాకపోవడంతో    రాజకీయాలలో జూనియర్ ఆర్టిస్టు పాత్ర పోషిస్తున్నారు. ఆమె 2010 లో కరుణానిధి నేతృత్వంలో "డీఎంకే" పార్టీ లో చేరారు.. తరువాత 2016 లో సోనియా గాంధీ తమిళనాడు వచ్చినపుడు ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ జాతీయ ప్రతినిధిగా ఉన్నారు. తమిళనాడు లో అసలా ఒక సీటైనా   గెలుస్తదో లేదో తెలియని పార్టీ కి ఆమె కీలక నాయకురాలు.  ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన అక్కడికి వెళ్లి  కాంగ్రెస్ తరపున  ప్రచారం చేయడం ఆమెకు అలవాటు. తాజాగా ఆమె తెలంగాణలో జరిగే ఎన్నికలలో ప్రచారానికి వచ్చి ఆమె సినీ పాపులారిటీతో ప్రేక్షకులను ప్రభావితం చేదాం అనుకున్నారు.. కానీ ఆమె సొంత రాష్ట్రంలోనే ఆమెకు సరైన గుర్తింపు లేదు ఇక్కడికి వచ్చి ఏమి చేస్తారో.

Related Posts