YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కువైట్ ప్రవాసీ కార్మికులకు కాంగ్రెస్ భరోసా 

కువైట్ ప్రవాసీ కార్మికులకు కాంగ్రెస్ భరోసా 

- కుంతియా నేతృత్వంలో కువైట్కు ప్రత్యేక బృందం

- ఈనెల 14 నుండి 17 వరకు పర్యటన 


 కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) పథకంలో వాపస్ రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు భరోసా, నైతిక మద్దతు కల్పించడానికి ఎఐసిసి, ఐఎన్టియుసి, టిపిసిసి-గల్ఫ్ ఎన్నారై విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం ఈనెల 14 నుండి 17 వరకు కువైట్ లో పర్యటించనుంది.

ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు రామచంద్ర కుంతియా నాయకత్వంలోని ప్రతినిధి బృందం కువైట్ దేశంలో పర్యటించి కష్టాల్లో ఉన్న భారతీయ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనుంది. ఈ బృందంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిపిసిసి-గల్ఫ్ ఎన్నారై విభాగం రాష్ట్ర కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి, జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు డా. జెఎన్ వెంకట్, మరికొందరు ప్రవాసి కార్మిక నాయకులు ఉన్నారు. 

కువైట్ ప్రభుత్వం జనవరి 29 నుండి ఫిబ్రవరి 22 వరకు ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇమిగ్రేషన్, నివాస చట్టాలను ఉల్లంఘించిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్ష లేకుండా తమ తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశం కల్పించారు. క్షమాబిక్ష పథకంలో కువైట్ లోని సుమారు 30 వేలమంది భారతీయ కార్మికులు స్వదేశానికి రావడానికి నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో 5 వేల మంది తెలంగాణ వలస కార్మికులున్నారు. కువైట్ లో ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసి కార్మికులు తన వాట్సప్ నెంబర్ +91 90000 95360 కు సంప్రదించవచ్చని నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు.

ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మాపై స్వరాజ్ కు లేఖలు రాశామని,  కువైట్ కు ప్రత్యేక అధికార బృందాన్ని పంపాలని, ఎన్నారై పాలసీని ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు లేఖ రాశామని నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు.  సమస్య తీవ్రత దృష్ట్యా కువైట్ క్షమాబిక్ష విషయాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాలని ప్రతిపక్ష నాయకులను కోరామని అన్నారు. 

భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి 
* కువైట్ లోని ఇండియన్ ఎంబసీ లో ఎమర్జెన్సీ సర్టిఫికెట్ల (అవుట్ పాస్) జారీ గురించి పెరిగిన రద్దీని తట్టుకోవడానికి అదనపు సిబ్బందిని నియమించాలని విదేశాంగ శాఖ కు విజ్ఞప్తి 
* భారత ప్రభుత్వం ఏర్ లైన్స్ (విమానయాన సంస్థలు) తో సంప్రదింపులు జరిపి విమాన చార్జీలను సరళతరం, చేసే విధంగా చూడాలి. ప్రయాణ రాయితీని కూడా కల్పించాని బృందం డిమాండ్ చేస్తుంది.

తెలంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి 
* క్షమాబిక్ష పథకంలో వాపస్ రావాలనుకునే కోరుతున్న ప్రవాసులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విమాన ప్రయాణ టికెట్లు ఇవ్వాలి 
* కష్టాల్లో ఉన్న ప్రవాసులను ఆదుకోవడానికి కువైట్ కు ప్రతినిధి బృందాన్ని పంపాలి 
* కువైట్ నుండి వాపస్ వచ్చిన ప్రవాసీ కార్మికులను ఆదుకోవడానికి వారు జీవితంలో స్థిరపడటానికి పునరావాస ప్యాకేజీని అమలు చేయాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేస్తుంది.

Related Posts