YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు

బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు

భూమధ్యరేఖను ఆనుకుని బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. గురువారం ఒక అల్పపీడనం, తర్వాత డిసెంబరు 9న మరోకటి ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావం రాబోయే మూడు రోజుల్లో హిందూమహాసముద్రం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణాది రాష్ట్రాల తీర ప్రాంతాలపై ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. మత్స్యాకారులు వేటకు వెళ్లరాదని, గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లోని అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం వరకు జిల్లాలో 4 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడం గమనార్హం. అత్యధికంగా పొదలకూరు మండలంలో 14 సెం.మీ వర్షపాతం నమోదుకాగా.. అత్యల్పంగా తడ మండలంలో 0.6 మి.మీల వర్షం కురిసింది. చెరువుల్లోకి నీరు చేరడంతో రబీ సాగుకు నార్లు పోయడానికి నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వర్షాలు ఊరట కలిగిస్తున్నాయి. మరోవైపు రబీ సాగుకు సంబంధించి పూర్తి ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి లేదని సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీర్మానం చేశారు. రబీలో 6.33 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంగా ఉంటే.. 3.21 లక్షల ఎకరాలకు మాత్రమే నీరిస్తామని జలవనరుల శాఖ తీర్మానించింది. జిల్లాకు కీలక సాగునీటి వనరుగా ఉన్న సోమశిల జలాశయం ఇప్పటి వరకు నిండలేదు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 34.7 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తిగా సాగు విస్తీర్ణానికి నీరివ్వాలంటే కనీసం మరో 20 టీఎంసీలు అవసరం. ప్రస్తుత వర్షాలతో సుమారు రూ.300 కోట్ల విలువైన పంట దిగుబడులు వచ్చే పరిస్థితి ఉందని వ్యవసాయశాఖ అధికారుల పేర్కొనటం గమనార్హం. 

Related Posts