పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం మలకపల్లి విచ్చేసిన రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారాలోకేష్ కు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అఖండ స్వాగతం పలికారు. గురువారం మలపల్లి గ్రామంలో పలు ప్రారంభోత్సకార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. గ్రామంలో పాదయాత్ర చేసి ప్రతి ఇంట్లో మహిళలను, వృద్దులను, మంత్రి పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత మలపల్లి సెంటర్ లో ఎన్ టిఆర్ విగ్రహాని పూలమాలు వేసారు. అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద నిర్మించబోయే సమగ్రరక్షిత మంచి నీటి సరఫరా పధకాన్ని ప్రారంభించారు. తీళ్ళపూడి మండలంలో 17 ఆవాస ప్రాతాలకు మంచి నీటి సరఫరా ప్రారంభోత్సవం చేయటం వలన ప్రజలకు మేలు కలుగుతుంది. అనంతరం 4 కోట్ల నిధులతో నిర్మిచబోయే మలకపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైలట్ ప్రాజెక్టును మంత్రి లోకేష్, కార్మికశాఖామంత్రి పితాని సత్యనారాయణ, ఎక్త్సెజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్, జెడ్ పి ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుతో కలసి ప్రారంభించారు. మలకపల్లి ఎస్ సి కాలనీ లో సిమ్మెంట్ రోడ్డు మొదలులో 10 అడుగులు రోడ్డు వేయకుండా వదిలి వేయ్యడంతో పంచాయితీ రాజ్ శాఖ ఇఇ మాణిక్యంను పిలిచి రోడ్డు ఈ కాస్తా ఎందుకు వదిలివేసారని ప్రశ్నించారు. డ్రైన్లు నిర్మాణాలకొలకు ప్రతి వీధిలో రోడ్లు కొంచం వదిలామని ఇఇ లోకేష్ కు తెలుపగా అలా వద్దు వెంటనే 10 అడుగుల రోడ్డు వెయ్యాలని ఇఇను మంత్రి లోకేష్ ఆదేశించారు. మహిళలు తమకు ఇళ్ళులేవని మంత్రి లోకేష్ కు తెలుపగా మంత్రి జవహర్ కల్పించుకొని ఈ కాలనీలో అర్హత గల వారి పేర్లు సేకరించామని వెంటనే ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి జవహర్ హామీ ఇచ్చారు. అనంతరం బహిరంగ సభకు మంత్రి లోకేష్ హాజరయ్యరు. ఈ కార్యక్రమంలో ఎమ్ ఆర్ ఒ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.