చేతి వృత్తుల కార్మికులకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఒకొక్క కుటుంబానికి సుమారు రూ.10 లక్షల వరకు ఈ ప్రభుత్వం ఆదాయం కల్పించింది. టీడీపీ ది బీసీల పార్టీ అని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. గురువారం అయన పుట్టపర్తి నియోజకవర్గంలో 1935 మంది లబ్దిదారులకు రూ.23 కోట్ల 26 లక్షలు పంపిణీ చేసారు. పల్లె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేసారు. టీడీపీ ప్రభుత్వం కులాల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించింది. నియోజకవర్గంలో నిరుద్యోగులకు నెలకు 1000 చొప్పున 2 వేల మందికి నిరుద్యోగ భృతి ఇస్తుందని అన్నారు. పసుపు కుంకుమ కింద ఒకొక్క మహిళకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో రూ.435 కోట్ల తో అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ, పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. చంద్రన్న బీమా పేదల జీవితానికి ధీమా అని అన్నారు. ఓస్సి,ఎస్టి ,బీసీ, మైనార్టీ కుటుంబాల్లో వివాహం చేసుకుంటే చంద్రన్న పెళ్లి కానుక, నియోజకవర్గ పరిధిలో 6400 మందికి ఎస్సి ,ఎస్టి ,బిసి,ఈబీసీ కుటుంబాలకు బ్యాంక్ సబ్సిడీ రుణాలు, కులమతాలకు అతీతంగా బడుగు ,బలహీన వర్గాలకు చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక..చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.314 కోట్లతో 15 వేల ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేస్తున్నాం. అర్హులకు 15 వేల మందికి రేషన్ కార్డ్స్, నియోజకవర్గంలో 11వేల879 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ, మనిషి పుట్టినరోజు నుంచి మరణించే దాకా వారి సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం టిడిపి నేని అయన అన్నారు.