బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ నటి, మోడల్ కేట్ శర్మ ఆరోపణలు చేసిన విష్యం తెలిసిందే. ఆమె చేసిన ఈ ఆరోపణలు తప్పని పోలీసులు తేల్చేశారు. తనతో ఒకరాత్రి గడిపితే సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని చెబుతూ తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేట్ శర్మ ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. నటి ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, సుభాష్ ఘయ్పై ఆమె చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చారు. అంతేకాదు, ఆరోపణల్లో పసలేదని తేలిపోవడంతో తన తల్లి ఆరోగ్యం బాగాలేదన్న సాకుతో దర్శకుడిపై పెట్టిన కేసును ఆమె వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.