తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ట్వీట్ చేసిన భారత్ ప్రధాని. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇవాళ ఎన్నికల రోజని, తెలంగాణలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.
ఇవాళ ఎన్నికల రోజు! తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వెయ్యమని కోరుతున్నాను.... ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయమని ప్రార్థిస్తున్నాను...
— Narendra Modi (@narendramodi) December 7, 2018