లెవల్ క్రాసింగ్ గేట్ 33E పెడన మచిలీపట్నం మధ్యలో ఉంది. (Km 26/9-27/0). ఇది ఇంజనీరింగ్ గేటు.రోజుకి ఈ లెవెల్ క్రాసింగ్ ద్వారా 24 ట్రైన్ మూమెంట్స్ ఉన్నాయి. మచిలీపట్నం పెడన మధ్య 10 కిలోమీటర్లు అవ్వడం వలన, ఈ గేటు నాన్ ఇంటర్లాక్ గేటు అవటం వలన ప్రతి ట్రైన్ మచిలీపట్నం లో బయలుదేరే ముందు నుండి పెడన చేరేవరకు కనీసం 25 నిమిషాల నుండి 30 నిమిషాల సేపు ఈ లెవెల్ క్రాసింగ్ గేటు ని మూసివేయడం వలన, లెవెల్ క్రాసింగ్ గేటు ద్వారా వెళ్లే రోడ్ ట్రాఫిక్ వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ పెడనలో కానీ ట్రై న్ క్రాసింగ్ ఏర్పాటు చేస్తే ఈ లెవెల్ క్రాసింగ్ గేటు కనీసం 35 నిమిషాల సేపు మూయబడి ఉంటుంది. అదీ కాకుండా రాబోవుకాలంలో డబ్లిన్ చేస్తున్నారు. అప్పుడు రైళ్ల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ లెవెల్ క్రాసింగ్ గేటు ద్వారా వెహికల్ యూనిట్ సంఖ్య (TVU s) 28053 కు పెరగటం వలన ఈ మధ్యకాలంలో దీని క్లాసిఫికేషన్ C నుండి B1 కు మార్చారు. ఈ క్లాసిఫికేషన్ ప్రకారము లెవెల్ క్రాసింగ్ గేటును ఇంటర్లాక్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఆలా చేయడం వలన గేటు పది నిమిషాల లోపు మాత్రమే మూయబడి ఉంటుంది. ప్రజలకు చాలా సౌకర్యం కలుగ చేసినట్లు అవుతుంది ముఖ్యంగా ఉదయం పూట స్కూల్ కి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు. కనుక ఈ విషయమై పరిశీలన చేసి తగు చర్య తీసుకో వలసిందిగా పెడన వాస్తవ్యులు కోరుతున్నారు.