భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి ఆసీస్ 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రేవిస్ హెడ్(61 నాటౌట్; 149బంతుల్లో), మిచెల్ స్టార్క్(8) క్రీజులో ఉన్నారు. 250/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆట మొదలు పెట్టిన భారత్.. ఖాతా తెరవక ముందే ఇన్నింగ్స్ ముగించింది. భారత బౌలర్లు పట్టు బిగించారు. బ్యాటింగ్‌కి దిగిన కంగారులను కట్టడి చేశారు.