నా తండ్రి దివంగత రాజగోపాల్ రెడ్డికి 1982లో గుండెపోటు వచ్చింది..చెన్నై విజయ ఆస్పత్రికి తీసుకెళ్లాం..శస్త్రచికిత్స చేయలేమని వైద్యులు చెప్పారు..అప్పుడు ఇంత మంది వైద్యులు లేరు.. 56 ఏళ్ల వయస్సులో 1983లో చనిపోయారు. ఇప్పుడు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాని మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన పొదలకూరులోని జెడ్పీ హైస్కూలులో సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేపల్లి గుండె భద్రత ఉచిత గుండె వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. మంత్రి మాట్లాడుతూ యువ వైద్యుడు కులారి నాగేంద్ర ప్రసాద్ మెరుగైన వైద్యసేవలందిస్తున్నాడు. చిన్నవయస్సులోనే సేవ చేయాలనే తపన ఉండటం అభినందనీయం. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పటి వరకు రూ.1,500 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం దురదృష్టవశాత్తు కొందరికీ అభివృద్ధి కనపడటం లేదని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కష్టాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 32 టీఎంసీలతో 3.21 లక్షల ఎకరాల్లో ఎలా పండించాలని ఆందోళనచెందాం..వర్షాలతో పండించగలమనే నమ్మకం వచ్చిందని అయన అన్నారు. ఒక్కో కాలువ కాలువ మీదకు పోయి పంట వేసుకోండని చెబితే అంతిమంగా నష్టపోయేది రైతులే. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టిన తర్వాత పంట ఎండిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసని అయన అన్నారు. సాగునీటి విషయంలో రాజకీయాలు తగవు. పొదలకూరు మండలాన్ని రాజకీయంగా వాడుకుని వదిలేశారు. వెనుకబడిన ప్రాంతం కావడంతో ప్రత్యేకంగా అభిమానం పెంచుకుని నిధులు మంజూరు చేయిస్తున్నానని అన్నారు. నాకు ఓట్లు తక్కువ వచ్చినా రాజకీయాలకు అతీతంగా పొదలకూరు మండలాన్ని అభివృద్ధి చేస్తున్నా. కొందరేమో వర్షాలు పడకూడదని కోరుకుంటున్నారు.. మొన్న పొదలకూరులో ఎక్కువ వర్షం కురిసిందని బాధపడుతున్నారు. వర్షానికి చెక్ డ్యాంల్లో నీళ్లు నిలవడం ఆనందంగా ఉంది. పెన్నా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోయినా 48 టీఎంసీల కృష్ణా జలాలు తీసుకొచ్చాం..అందులో 15 టీఎంసీలు కండలేరుకు మళ్లించామని అయన గుర్తు చేసారు. ఆరు నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలకు కండలేరులో నీరు ఉపయోగపడనుంది. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నాం..సర్వేపల్లి నియోజకవర్గంలో నెలకు రూ.40 కోట్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని సోమిరెడ్డి అన్నారు.