YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పశ్చిమ్‌ బంగలో తప్పకుండా మా యాత్రలను కొసాగిస్తా బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా

పశ్చిమ్‌ బంగలో తప్పకుండా మా యాత్రలను కొసాగిస్తా         బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో పశ్చిమ్‌ బంగలో ‘ప్రజాస్వామ్య రక్షణ ర్యాలీ’ పేరుతో రథయాత్ర చేపట్టాలని ఏర్పాట్లు చేసుకోగా, అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు నుంచి జరగాల్సిన ఆయన యాత్ర వాయిదా పడింది. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ దీనిపై స్పందించిన అమిత్‌ షా.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము పశ్చిమ్‌ బంగలో తప్పకుండా మా యాత్రలను కొనసాగిస్తాము. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో భాజపా రథయాత్రలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు అమిత్‌ షా ఈ రోజు ప్రకటించారు.‘మేము యాత్రలను నిర్వహించి తీరతాం. ఈ రాష్ట్రంలో మార్పును తీసుకురావాలని భాజపా నిర్ణయించుకుంది. మా యాత్రలు రద్దు కాలేదు.. వాయిదా పడ్డాయి. ఆ రాష్ట్రంలో పరిపాలన బాగోలేదు. దేశంలోనే అత్యధికంగా రాజకీయ హత్యలు జరుగుతున్న రాష్ట్రంగా పశ్చిమ్‌ బంగకు పేరుంది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ పరిపాలనా విభాగం అంతా తృణమూల్‌ కాంగ్రెస్‌ కోసమే పని చేస్తోంది’ అని అమిత్‌ షా విమర్శించారు. కాగా, పశ్చిమ్‌ బంగలో ఈ రోజు కూచ్‌ బిహార్‌ జిల్లాలో, డిసెంబరు 9న కాక్‌ద్వీప్‌లో, డిసెంబరు 14న తారాపిత్‌లో భాజపా రథయాత్రలు నిర్వహించాలనుకుంది.

Related Posts