ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానాల లాంటి కొన్ని ఆలయాల్లో మాత్రమే ఉన్న డ్రస్‌కోడ్.. త్వరలో విజయువాడ కనకదుర్గమ్మ గుడిలోనూ రానుంది. జనవరి ఒకటో తేదీ నుంచి భక్తులు ఏ దుస్తులు పడితే అవి ధరించి ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ ఆలయంలోకి వెళ్లడానికి వీల్లేదు. కేవలం సంప్రదాయ దుస్తులతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకే ఈ డ్రస్‌కోడ్‌ను అవులుచేయాలని ఆలయ అధికార వర్గాలు నిర్ణయించాయి. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద ఆలయైమెన దుర్గగుడిలోకి భక్తులు ప్రస్తుతం ఎలా పడితే అలా వస్తున్నారన్న వివుర్శలున్నాయి. ఇంతకుముందు కూడా పలు సందర్భాలలో ఇలా డ్రస్‌కోడ్ అవులుచేయాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు భావించినా, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇటీవల జరిగిన ట్రస్టుబోర్డు సమావేశంలో పలువురు సభ్యులు ఈవో కోటేశ్వరమ్మను డ్రస్‌కోడ్ తప్పనిసరి చేయాలని కోరారు. కొంతమంది భక్తులు ఆధునిక దుస్తుల్లో ఆలయానికి వస్తూ పవిత్రతను మంటగలుపుతున్నారని అన్నారు. అయితే, సమావేశంలో అప్పటికప్పుడు మాత్రం ఈవో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆలయ వైదిక కమిటీ సభ్యుల అభిప్రాయం కూడా తీసుకుని ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు. దానిపై ఇంకా తర్జనభర్జనలు జరుగుతుండగానే భారత మహిళా క్రికెట్ జట్టులోని కొంతమంది సభ్యులు సుమారు వారం రోజుల క్రితం ఆలయానికి వచ్చినపుడు భక్తుల సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఆధునిక దుస్తులు ధరించి వచ్చారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన ఈవో కోటేశ్వరమ్మ.. తక్షణం ఆలయ అధికారులను డ్రస్‌కోడ్ గురించి భక్తులకు అవగాహన కలిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుర్గగుడి ప్రాంగణంలోకి ప్రవేశించాలంటే భక్తులు తప్పనిసరిగా అమ్మవారితో ఆధ్యాత్మికంగా అనుబంధం కలిగి ఉండాలి తప్ప, అసభ్య ఆకర్షణలకు కాదని ఆమె చెప్పారు. మహిళా భక్తులు చీర లేదా సల్వార్ కమీజ్ ధరించి రావాలని, అలాగే పురుషులు ధోతీ లేదా ప్యాంట్లు, షర్టులు ధరించి రావాలని.. ఇదే డ్రస్ కోడ్ అని ఈవో కోటేశ్వరమ్మ స్పష్టంచేశారు. త్వరలోనే స్టాళ్లలో కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.