పార్టీలతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీ అయినా తన దగ్గరకు రావాలనే ఓ రకమైన అజెండాతో ముందుకు సాగిన నాయకుడిగా కూడా ఆమంచికి ఇక్కడ పేరు ఉంది. స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్న ఆమంచికి నియంతృత్వం చేస్తున్నారనే బ్యాడ్ నేమ్ కూడా ఉండడం గమనార్హం. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియని నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. 2014లో చీరాల నియోజకవర్గం నుంచి స్వతంత్ర పార్టీపై గెలిచిన ఆమంచి.. టీడీపీ నాయకురాలు పోతుల సునీతను ఓడించారు.ఇది పెద్ద వివాదానికి దారితీయడం, మళ్లీ మళ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం వంటివి కూడా జరిగాయి. అయినా కూడా ఆమంచి వెరవలేదు. చివరకు ఆమంచిదే గెలుపు అని స్పష్టంగా తేలిపో యింది. తనకంటూ ఓ ప్రొఫైల్ ఏర్పాటు చేసుకుని సొంతగా ప్రజల్లోకి వెళ్లడం అలవాటు చేసుకున్న ఆమంచి ఏ పార్టీతోనూ, ఏ నేతతోనూ కలిసి పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఆమంచి మంచికి ప్రజల నుంచి ఆదరణ ఉంది. ఆయన ఒకింత రఫ్‌గా ఉన్నా కూడా ప్రజలు ఆయనకు జైకొట్టడం ఇప్పటికీ కలిసి వస్తున్న పరిణామం. అయితే, ఆయనంటే గిట్టని ప్రభుత్వాలు అనేక కేసులు నమోదు చేశాయి. ఇప్పటికీ ఆయనపై రౌడీ షీటు ఓపెన్ చేసేందుకు ఓ సీఐ గట్టిగా ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది. ప్రజల నుంచి ఆదరణ ఉన్న ఆమంచిని చంద్రబాబు స్వయంగా పార్టీలోకి తీసుకున్నారు. అయి తే, ఈ విషయం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు కూడా ముందు తెలియదు. దీం తో చంద్రబాబు నిర్ణయానికి ఆయన జై కొట్టక తప్పలేదు. అయితే, ఇక్కడ బాబు నిర్ణయం మేరకు ఆమంచి పార్టీలో అయితే చేరగలిగారు తప్పితే.. స్థానికంగా ఉన్న నాయకులతో మాత్రం ఆయన కలవలేక పోయారు. ఏ కార్యక్రమానికి ఆయన ఇప్ప టి వరకు వచ్చినదాఖలాలేదు. ఒక్క ఒంగోలులో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట సభకు తప్ప. అది కూడా బాబు ఆహ్వానిస్తేనే వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇక గత ఎన్నికల్లో తన మీద ఓడిపోయిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా ఆమంచికి రుచించడం లేదు.పార్టీ మారినా కూడా టీడీపీలో ఇమడలేకపోతోన్న ఆయన వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. కమ్యూనిటీ పరంగా తన సామాజిక వర్గ ప్రతినిధులతోనూ టచ్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత పవన్‌తో సైతం ఆయన టచ్‌లో ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు ఆమంచి పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆమంచి పార్టీ మారతారని తాజాగా ప్రచారం ఊపందుకుంది. అయితే, దీనికి స్థానికంగా టీడీపీ నేతల నుంచి ఆమంచికి ఎలాంటి సహకారం ఉండ డం లేదని కొందరు వాదిస్తుండగా.. ఆమంచే వారితో కలిసి ముందుకు సాగడం లేదని మరికొందరు అంటున్నారు మొత్తానికి ఈ పరిణామం.. ఆమంచి పార్టీ మారే దిశగా ప్రేరేపిస్తుందా? లేదా? అన్నది చూడాలి. అయితే ఆమంచిని కూడా టీడీపీ పూర్తిగా నమ్మటం లేదని… అందుకే అక్కడ పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టు మరో టాక్ కూడా ఉంది.