కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో పది శాతం వాటాను బెర్క్‌షైర్ హాథ్ వే కొనుగోలు చేయనుందన్న వార్తలు వచ్చాయి. 4 నుంచి 6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కోటక్ బ్యాంక్ వాటాను బెర్క్‌షైర్ తీసుకుంటే రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం బ్యాంకులో తన వాటాను ఉదయ్ కోటక్ 20 శాతానికి తగ్గించుకునే వీలుంటుంది. అయితే బెర్క్‌షైర్ ప్రణాళికలపై తమకు ఎలాంటి సమాచారం లేదనీ, మార్కెట్ స్పెక్యులేషన్లపై వ్యాఖ్యానించలేమని కోటక్ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. బెర్క్‌షైర్ హాథ్‌వే నుంచి కూడా ఎలాంటి ధృవీకరణలు లభించలేదు.ఉదయ్ కోటక్ అతని కుటుంబసభ్యులకు బ్యాంకులో వాటాను డిసెంబర్ చివరి నాటికి 20 శాతానికి, మార్చి 2019 నాటికి 15 శాతానికి తగ్గించుకోవాలని రిజర్వ్‌బ్యాంక్ ఆదేశించింది. దేశంలో నాలుగో అతి పెద్ద బ్యాంకు అయిన కోటక్‌లో పది శాతం వాటాను తీసుకుంటున్నట్టు కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.