నిధులు లేక ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియ సతమతమవుతుంది. కనుక ఆ సంస్థ ముంబైలోని 23 అంతస్తుల భవనాన్ని అమ్మకానికి పెట్టారు. ఆ భవనాన్ని దక్కించుకోవాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్‌ఐసీ, జీఐసీలు చూస్తున్నాయి. ఎయిర్ ఇండియా బిల్డింగ్ విక్రయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ పలు ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఆసక్తి చూపుతున్నాయని కంపెనీ వర్గాల వెల్లడించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి జనవరి 2018 నాటికి ఈ భవంతిని కిరాయికి ఇవ్వడంతో రూ.291 కోట్లకుపైగా నిధులు సమకూరాయి. ప్రస్తుతం సంస్థకు రూ.55 వేల కోట్ల స్థాయిలో రుణాలు ఉన్నాయి.