YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

ప్రముఖ నటుడు విజయకుమార్ కుమార్తెను అరెస్ట్ చేసిన పోలీసులు..!!

ప్రముఖ నటుడు విజయకుమార్ కుమార్తెను అరెస్ట్ చేసిన పోలీసులు..!!

 తమిళ నటుడు విజయకుమార్ కూతురిని పోలీసులు అరెస్ట్ చేసారు. గతకొంత కాలంగా విజయకుమార్.. అయన కుమార్తె వనిత మధ్య ఆస్తి వివాదాలు  జరుగుతున్నాయి. విజయకుమార్‌కు చెన్నైలోని పెద్ద బంగ్లా ఉంది. ఆయన సినిమా షూటింగ్ ల కోసం అద్దెకు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఓ సినిమా కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్న వనిత అందులో దిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేసేందుకు నిరాకరించింది. అందువలన విజయకుమార్ గతంలో మధురవాయిల్ పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో వనిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆమెను అరెస్ట్ చేయరాదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం మళ్లీ తిరిగివచ్చింది. దీంతో విజయకుమార్ మరోసారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు..

Related Posts