YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పకడ్బందీ వ్యూహాంతో పవన్

పకడ్బందీ వ్యూహాంతో పవన్
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చక్రం తిప్పేస్తాడెమో! తన అన్నలా కాకుండా పకడ్బందీ వ్యూహంతో రంగంలోకి దిగారేమో పవన్.. అనుకున్నారంతా. కానీ ప్రస్తుతం ఒకదాని తరువాత ఒకటి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన రాజకీయ ఓనమాలు ఇంకా నేర్చుకోలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాదాపు అయిదేళ్ల క్రితం పార్టీ పెట్టి నేటికీ ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. చేస్తాడా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. జనసేన నాయకుడు జనం కోసం వచ్చాడు.. జనానికి తెలియని ఎన్నో విషయాలు చెప్పి మేల్కొలుపుతాడని అనుకున్నారు మొదట్లో పవన్ ఆవేశం చూసి. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు చూస్తే, చెప్పే మాటలు వింటే అసలు పవన్ ఏం చేస్తున్నాడో! అయన ఎజెండా ఏంటో ఎవ్వరికీ అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ పవన్ రాజకీయ గందరగోళంలో పడిపోయాడా? లేక మనమే ఆయన మాటలు విని గందగోళానికి గురవుతున్నామా? అనేది జనానికి అంతుచిక్కటం లేదట. జనసేనాని తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోందట. తెలంగాణ ఎన్నికలు జరగనున్న ఈ తరుణంలో పవన్.. వ్యవహరించిన తీరుపై పలు రకాల చర్చలు ఊపందుకున్నాయి. తెలంగాణాలో అసెంబ్లీ రద్దు చేయగానే.. అన్ని రాజకీయ పార్టీలు ఎవరి ప్లాన్ వారు వేసుకున్నారు. కానీ పవన్ మాత్రం తీరా నామినేషన్స్ ముగిసేదాకా.. స్తబ్దుగా ఉండి చివరకు జనసేన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చెప్పారు. ఇక ఆ తర్వాత తన మద్దతు ఎవరికో ప్రకటిస్తానని చెప్పిన ఈ జనసేనాని.. చివరకు గజిబిజి గందరగోళ విషయం చెప్పారు. ఎవరికి మద్దతనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా.. ఓ మంచి నాయకున్ని ఎన్నుకోండి అంటూ నీతి వాక్యాలు చెప్పారు. దీంతో ఈ మొత్తం సీన్ చూసిన జనానికి ఓ విషయం క్లారిటీగా అర్థమయిందట. పవన్ గందరగోళంలో పడ్డారని, ఇలా అయితే ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమే! అనుకుంటున్నారట.  

Related Posts