YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాన్సర్ అంబులెన్స్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కాన్సర్ అంబులెన్స్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కాన్సర్ ముందస్తు నిర్దారణ సంచార వైద్య పరీక్షల వాహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఉండవల్లిలోని నివాసం వద్ద రాజమండ్రిలోని జి.ఎస్.ఎల్. మెడికల్ కాలేజీ , క్యాన్సర్ ఇన్స్ స్టిట్యూట్ , ఎంపీ మురళీమోహన్ సమకూర్చిన ఎంపీలాడ్స్ నిధులతో సమకూర్చిన క్యాన్సర్ ముందస్తు నిర్దారణ సంచార వైద్య పరీక్షల వాహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. క్యాన్సర్ ముందస్తు సంచార వైద్య పరీక్షల వాహనం ద్వారా క్యాన్సర్ రోగులను గుర్తించడం కోసం ఆధునిక వైద్య సౌకర్యాల ఏర్పాటును జి.ఎస్.ఎల్. మెడికల్ కాలేజీ  చైర్మన్ గన్ని భాస్కరరావు ముఖ్యమంత్రికి వివరించారు. క్యాన్సర్ నిర్ధారణ కోసం సంచార వాహనంలో అమర్చిన మొబైల్ అల్ట్రా సౌండ్ , మామ్మో గ్రఫి , డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రాథమిక దశలోనే  సర్వైకల్ ,  భ్రెస్ట్ క్యాన్సర్ లను గుర్తించడం జరుగుతుందని ముఖ్యమంత్రికి తెలిపారు.  చంద్రన్న సంచార చికిత్సా కేంద్రాలకుతోడు ప్రయివేట్ సంస్థలు, ఎంపీ లాడ్స్ నిధులతో మరిన్ని సంచార వైద్య వాహనాలు అందుబాటులోకి రావాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. క్యాన్సర్ నిర్ధారణకు నేడు అనేక ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడం శుభసూచికమన్నారు. క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని లాజికల్ గా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. క్యాన్సర్ పై ప్రజల్లో అపోహలు తొలగించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపైనా ఉందన్నారు. అందుకు తగిన వేదిక ఏర్పాటు చేయడంలో ప్రయివేట్ భాగస్వామ్యాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కూడా వైద్య ఆరోగ్యశాఖకు సూచించారు.

Related Posts