
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. ఎస్ఎంఎస్ మొబైల్స్ స్టోర్ లో షట్టర్ పగలగొట్టి అక్కడున్న రూ 7 లక్షల విలువ జేసే 72 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. కేశపల్లిస్ ఎంటర్ ప్రైజెస్ లో రూ 3 లక్షల విలువ జేసే 30 సెల్ పోన్లు చోరీ చేసారు. తరువాత ఆర్కే మొబైల్ స్టోర్లో 40 పోన్లు చోరీ చేసారు. ఈ దుకాణాలన్నీ జాతీయ రహదారిపై వుండడం విశేషం. ఐదు మంది సభ్యుల దొంగల ముఠా దర్జాగా కారులో వచ్చి, దుకాణాల షట్టర్లు పగలగొట్టి ఫోన్లను ఒక మూట గట్టుకొని కారులో వేసుకొని పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికలు కావడంతో భద్రత కోసం పోలీసులు బిజీగా వున్నారు. ఆదే అదనుగా భావించిన దొంగలు పక్కా పథకం రూపొందించి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుల సమాచారం మేరకు ఎయిర్ పోర్ట్ పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేకంగా క్లూస్ టీం రప్పించి మూడు దుకాణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.