YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

త్వరలో వామపక్షాల కార్యాచరణ

త్వరలో వామపక్షాల కార్యాచరణ
రాష్ట్రంలో అత్యదిక మండలాలు కరువు కోరల్లో చిక్కు కున్నాయి. 522 మండలాలు డ్రై మండలాలుగా ఉన్నాయి. 347మండలాలు కరువుమండాల ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని వామపక్షల నేతలు అన్నారు.  శనివారం విజయవాడలో సిపిఐ,సిపిఎం నేతల సమావేశం జరిగింది. తరువాత వారు మీడియా తో మాట్లాడారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఉన్న వైరం ప్రజలకు శాపం గా మారింది. రబి పంటలేదు, ఖరిప్ లో నష్ట పోయారు. రైతుల పరిస్థితులు దయనీయంగా మారాయని అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు లపై ,ఈ నెల 17న కర్నూలు లో ఇరు పార్టీల ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని భావించాం.అలాగే సిపిఐ, సిపియం ఆద్వర్యంలో పిపుల్స్ ఎజెండా ఒకటి ప్రకటించ నున్నామని వెల్లడించారు.  ఆ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించాం. త్వరలో అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. సీపీఎం నేత వై వెంకటేశ్వరరావు  మాట్లాడుతూ అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వ్యవసాయం గ్రోత్ పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కాని పాలేకర్ వ్యవసాయ విధానం రాష్ట్రంలో జీరో అని తెలుస్తుంది. ప్రజాధనం 10కోట్లు వెచ్చించి పకృతి వ్యవసాయం పై  గుంటూరులో నేడు శిక్షణ ఇవ్వటంపై చంద్రబాబు నైజం తెలుస్తుందని అన్నారు. పాలేకర్ వ్యవసాయ విధానంపై ముఖ్యమంత్రి స్పష్టమైన విధానం ప్రకటించాలని అన్నారు. చంద్రబాబు అర్దిక వ్యవస్థ ను అతలాకుతలం చేస్తున్నాడు. రాయలసీమ ప్రజలు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఎకరాకు 25వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. కర్నూలు లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం తరువాత రాష్ట్ర స్దాయి ఆందోళనలకు కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు. 

Related Posts