YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నాసా మరో విజయం.. అంగారకుడి మీద శబ్ద తరంగాలను రికార్డ్‌

నాసా మరో విజయం.. అంగారకుడి మీద శబ్ద తరంగాలను రికార్డ్‌
ఇప్పటివరకూ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ అనంత విశ్వంలో మానవ మనుగడకు అనుకూలంగా ఉన్న ఏకైక ప్రదేశం భూ గ్రహం మాత్రమే. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఈ భూమి పరిమాణం మాత్రం పెరగడం లేదు, పెరగదు కూడా. దాంతో మానవ మనుగడకు అవసరమైన మరో గ్రహాన్ని అన్వేషించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో శాస్త్రవేత్తల చూపు అరుణగ్రహం(మార్స్‌) మీదకు వెళ్లింది. అరుణ గ్రహం మనుషుల ఆవాసానికి అనుకూలంగా ఉందా, లేదా తెలసుకునేందుకు శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు జరుపుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. తొలిసారి శాస్త్రవేత్తలు అంగారకుడి మీద వచ్చే శబ్ద తరంగాలను రికార్డ్‌ చేశారు. నాసా అంగారకుడి పైకి పంపిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ మార్స్‌పై వచ్చే గాలి తరంగాల శబ్దాలను రికార్డు చేసింది. ఇంత వరకూ మార్స్‌ పరిసరాలకు సంబంధించిన ఫోటోలను మాత్రమే పంపిన ఇన్‌సైట్‌ తొలిసారిగా అంగారకుడిపై వచ్చే గాలి శబ్దాలను రికార్డు చేసిందని నాసా తెలిపింది. గంటకు 10 నుంచి 15 మైళ్ల వేగంతో వీస్తున్న గాలి తరంగాలను ఇన్‌సైడర్‌ ల్యాండర్‌ రికార్డు చేసింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని రెండు సెన్సార్లు గాలి తరంగాల శబ్దాలను నమోదు చేశాయని..  ఈ శబ్దాలు గాలిలో జెండా ఎగుతున్నప్పుడు వచ్చిన శబ్దాల మాదిరిగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు థామస్‌ పైక్‌ వెల్లడించారు.అంగారకుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ నవంబరు 26న మార్స్‌పై విజయవంతంగా దిగింది. అయితే గతంలో మాదిరి కాకుండా చాలా అధునాతన టెక్నాలజీతో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా రూపొందించింది. అంగారకుడి గ్రహంలోని రాతి పొరల నిర్మాణాల గురించి, అక్కడ వచ్చే భూకంపాలను అధ్యయనం చేయడం కోసం, దాని ఉపరితలం నుంచి వెలువడే వేడి గురించి అధ్యాయనం చేయడం కోసం ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌లో అత్యాధునిక భూకంప శాస్త్రపు సాధనాలను వినియోగించినట్లు నాసా తెలిపింది.

Related Posts