YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రోడ్డుపై బ్యాలెట్‌ బాక్స్‌.. ఇద్దరు అధికారుల సస్పెండ్‌

రోడ్డుపై బ్యాలెట్‌ బాక్స్‌.. ఇద్దరు అధికారుల సస్పెండ్‌
రాజస్థాన్‌లో పోలింగ్‌ ముగిసిన వేళ.. ఓ బ్యాలెట్‌ బాక్స్‌ రోడ్డుపై పడి ఉండడం చర్చనీయాంశమైంది. కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని షాహబాద్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రహదారిపై ఉన్న బ్యాలెట్‌ యూనిట్‌ను పోలీసులు పరిశీలించారు. ఎన్నికల సంఘం సీల్‌ వేసి ఉండడంతో ఈవీఎంలను వాహనాల్లో తరలించేటప్పుడు పడిపోయి ఉంటుందని భావించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు అబ్దుల్‌ రఫీక్‌, నవల్‌ సింగ్‌ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారని ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. తర్వాత ఆ బ్యాలెట్‌ను పోలీసులు కిషన్‌గంజ్‌లో మిగతా ఈవీఎంలు నిల్వ ఉంచిన స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు.రాజస్థాన్‌ ఎన్నికల చరిత్రలోనే శుక్రవారం అత్యధికంగా 72.7 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. అల్వార్‌ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్‌ సింగ్‌ మరణించడంతో అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. శుక్రవారం సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని వెల్లడించాయి.

Related Posts