దళితులు దళితులుగా, పేదలు పెదవాళ్లుగా మిగిలిపోతున్నారని, అవినీతి రహిత సమాజం జనసేన తోనే సుసాధ్యం అని మాజీ మంత్రి, జనసేన నేత రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు.. విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...జనసేన లక్షాలను, విధివిధానాలు తెలియజేసేందుకు జనసేన తరంగంను జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అనంతపురంనుంచి ప్రారంభించారన్నారు. జనసేన తరంగం ఈ నెల 9వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. నేడు ఉన్న రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతిని పారద్రోలేందుకు జన సేన పోరాడుతుందన్నారు. వ్యవస్థలో ఉన్న అసమనత కారణంగానే దళితులు దళితులుగా, పేదలు పెదవాళ్లుగా మిగిలిపోతున్నారు. నూతన సమాజం జనసేన తోనే సాధ్యం. మార్పుకోసం జనసేన కృషి చేస్తోంది. అవినీతి రహిత పాలన కోసం ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు దగ్గరయ్యేలా‘జనసేన తరంగం’ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారన్నారు. జనసేన తరంగం’లో భాగంగా జనసేన కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళుతున్నారని... ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. పార్టీ సిద్ధాంతాల్ని, హామీల్ని వారికి వివరించి... కరపత్రాలు అందజేస్తున్నారన్నారు. పార్టీ సిద్ధాంతాల్ని, హామీల్ని ప్రజలకు వివరించడం, వారు అంగీకరిస్తే పార్టీ సభ్యులుగా చేర్చుకోవడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. అనంతపురం జిల్లా జనసేన తరంగంలో అధ్యక్షులు పవన్ కల్యాణ్తో పర్యటించిన అనుభవాలను వివరించారు. అనంతపురం కరువుతో అల్లాడుతుందన్నారు. అవినీతి రహిత సమాజం జనసేన తోనే సుసాధ్యం. ప్రజల కోసం ప్రభుత్వం పని చేయాలి గాని రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేయకూడదన్నారు. ఏపి అవినీతి రహిత, సమసమాజ నిర్మాణానికి అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.