YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కెప్టెన్ నయా రికార్డ్

 కెప్టెన్ నయా రికార్డ్
కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో తాజాగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 37 (3, 34) పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత అందుకోగా.. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే.. సచిన్ టెండూల్కర్ వెయ్యి పరుగుల మార్క్‌ని 20 టెస్టుల్లో చేరుకోగా.. కోహ్లీ మాత్రం కేవలం 9 టెస్టుల్లోనే అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాని ఓసారి పరిశీలిస్తే..! సచిన్ టెండూల్కర్ 1,809 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ 1,236 పరుగులు (15 టెస్టుల్లో), రాహుల్ ద్రవిడ్ 1,143 పరుగులు (15 టెస్టుల్లో) టాప్-3లో కొనసాగుతున్నారు. వాస్తవానికి వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఆస్ట్రేలియాలో 1,000 చేశాడు. కానీ.. అందులో 83 పరుగులు.. ఐసీసీ వరల్డ్ ఎలెవన్ టీమ్‌ తరఫున ఆడి చేసినవి. 

Related Posts