YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజీ మార్గమే ఉత్తమం

 రాజీ మార్గమే ఉత్తమం

పశ్చిమగోదావరిజిల్లాలో ఇంతవరకు సుమారు 6 వేల వివిధ రకాల కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించడం జరిగిందని జిల్లా జడ్జి గంధం సునీత వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాజీ మార్గమే కేసుల పరిష్కరించుకోవడంలో ఉత్తమమైన మార్గమని, కేసులనుండి త్వరగా విముక్తి పొందవచ్చునని అన్నారు. దిన్నీ కక్షిధారులు గుర్తించి ముందుకు వస్తున్నారని,  ఇది చాలా సంతోషించదగ్గ విషయమని చెప్పారు. జనవరి 2018 నుండి ఇంతవరకు జిల్లాలో 657 బెంచ్ లు ఏర్పాటుచేయడం ద్వారా 768 ప్రీ లిటిగేషన్ కేసులు, 5447 పెండింగ్ కేసులు పరిష్కరించడంతోపాటు, 540 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు  చెప్పారు.  కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృధా చేసుకోవద్దని అన్నారు.  ఇరుపక్షాల వారు మంచి  హృదయంతో రాజీ చేసుకోవడం ద్వారా కేసులు పరిష్కరించుకుని ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలని కోరారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ.విజయకుమార్ మాట్లాడుతూ పరిష్కంచదగిన కేసుల పరిష్కరంలో ఇరుపక్షాలవారికి అన్ని విధాల తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. మొదటి అడిషనల్ జిల్లా జడ్జి జి.గోపి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించుకునే శక్తి మనలోనే వుందన్నారు. సమస్యలు పరిష్కరించుకునే శక్తి, అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడెక్కడికో,ఎవరెవరి దగ్గరకో తిరుగుతూ సమయం, డబ్బు వృధాచేసుకుంటామని అన్నారు. మనలోని అసూయ, ధ్వేషం, అహంకారం మనలను పాడు చేస్తాయన్నారు. వాటిని విడిచిపెట్టి బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే ఎంత పెద్ద కేసుఅయినా రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా పొలంలో దమ్ముచేస్తుంటే ప్రక్క పొలంలో నీళ్లు పడ్డాయనే చిన్న కారణంగా గొడవపడి కేసులు పెట్టుకుని మూడు సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వేడివాడకు చెందిన 7 మంది అన్నదమ్ములు, అన్నదమ్ముల పిల్లలు రాజీ ద్వారా కేసు పరిష్కరించుకోవడంపట్ల జిల్లా జిడ్జి గంధం సునీత సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ, సినియర్ సివిల్ జడ్జి కె.శైలజ, ఎస్ శారదాదేవి, ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు, కక్షిధారులు తదితరులు పాల్గొన్నారు.  

Related Posts