YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఫేస్‌బుక్‌ కు ఇటలీ ప్రభుత్వం రూ. 80 కోట్లు జరిమానా

ఫేస్‌బుక్‌ కు ఇటలీ ప్రభుత్వం  రూ. 80 కోట్లు జరిమానా
కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణంతో ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ వివాదం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఇప్పటికే పలు దేశాల్లో జరిమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఇటలీ కూడా ఈ సంస్థకు భారీ జరిమానా విధించింది. యూజర్ల అనుమతి లేకుండా వారి వివరాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ వినియోగదారుల భద్రత చట్టాలను పరిరక్షించే కాంపిటిషన్‌ అథారిటీ ఏజీసీఎం.. ఫేస్‌బుక్‌కు 10 మిలియన్‌ యూరోల(భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 80కోట్లకు పైమాటే) జరిమానా విధించింది.‘ ఖాతాలు తెరవడంలో యూజర్లను ఫేస్‌బుక్‌ తప్పుదోవ పట్టిస్తోంది. యూజర్లు ఇచ్చే డేటా వాణిజ్య అవసరాలకు ఎలా వినియోగించుకుంటాం అనే సమాచారాన్ని ఫేస్‌బుక్‌ ఖాతాదారులకు ముందుగానే చెప్పట్లేదు. తమ సేవల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా సంస్థ స్పష్టంగా వెల్లడించట్లేదు. ఇక యూజర్ల డేటాను వారి అనుమతి లేకుండానే ఇతర కంపెనీలకు విక్రయిస్తోంది’ అని ఏజీసీఎం ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 10 మిలియన్‌ యూరోలు చెల్లించాలని ఆదేశించింది.ఇదిలా ఉండగా.. ఫేస్‌బుక్‌ మాత్రం తాము ఖాతాదారుల డేటాను విక్రయించలేదని చెబుతూ వస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కోట్లాది మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి యూజర్ల డేటాను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై ఫేస్‌బుక్‌ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది.

Related Posts