తెలంగాణలో 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను డిసెంబరు నెలాఖరులోగా ఖరారు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. నాలుగురోజులపాటు జరిగే ఎంసెట్, ఇతర ప్రవేశపరీక్షలు, ఏపీలో ఎంసెట్ తేదీలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. మే 5న జరిగే నీట్‌తోపాటు జాతీయస్థాయి ప్రవేశపరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకొని తేదీలను ఖరారుచేస్తామని విద్యామండలి అధికారులు తెలిపారు.