ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌట్ అయింది. 151/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మ్యాచ్ ప్రారంభించిన భారత్ నాలుగోరోజు 156 పరుగులు జోడించింది. పుజారా(71; 204బంతుల్లో), అజింక్య రహానె(70; 147బంతుల్లో) రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో టీమిండియా 323 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది.