ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే స్థానంలో భారత్ నిలిచింది. చివరి రోజైన సోమవారం మరో ఆరు వికెట్లు తీస్తే టీమిండియాను విజయం వరించనుంది. నాలుగో రోజు 153/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటై, ఆసీస్‌కు 323 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. రహానె, పుజారా అర్ధ శతకాలతో రాణించారు. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 104/4తో నిలించింది.