అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కు అరుదైన గౌరవం లభించింది. ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’కు తాను ఎంపికైంది.ఈ అవార్డుకు ఎంపికైన జాన్వీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. ఈ అవార్డు తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. ఈ ఏడాది 'ధడక్' చిత్రం ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టానని, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను చూశారని తెలిపింది. ఈ సినిమాను వీక్షించిన నార్వే ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది.