- మీ మర్మాంగాల్లో కాల్చుతాం.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగ్ డుటెర్టె క్రూరమైన వ్యాఖ్యలు చేశారు. మర్మాంగాల్లో కాల్చుతామంటూ కమ్యూనిస్టు రెబల్స్ మహిళలకు హెచ్చరించారు. తన వ్యాఖ్యలను అమలు చేయాలని సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ‘సైన్యానికి చెప్పండి.. మేయర్(ప్రభుత్వం) నుంచి ఓ కొత్త ఆదేశం వస్తుందని! రెబల్స్ మహిళల మర్మాంగాల్లో కాల్చలన్నదే ఆ ఆదేశం’ అంటూ ఇటీవల జరిగిన మాజీ తిరుగుబాటుదారుల సమావేశంలో రోడ్రిగ్ డుటెర్టె వ్యాఖ్యలు చేశారు. ‘మేము మిమ్మల్ని చంపం. మీ మర్మాంగాల్లో కాల్చుతాం. మర్మాంగాలు లేనప్పుడు మీరున్నా లేకున్నా ఒక్కటే’ అంటూ రెబల్స్ మహిళలనుద్దేశించి ఆయన హెచ్చరించారు. ఇప్పటికే.. జైళ్లలో మగ్గుతున్న అనేక మంది రెబల్స్ మహిళలను సిబ్బందితో అత్యాచారాలు చేయించి చంపిస్తున్నారన్న ఆరోపణలు అధ్యక్షుడిపై ఉన్నాయి.