YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దొనకొండ వద్ద డ్రోన్

దొనకొండ వద్ద డ్రోన్
విమానయానానికి సంబంధించిన శిక్షణ, పరిశోధన కోసం ఒక సంస్థను దొనకొండ వద్ద ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డ్రోన్ ల పరీక్షల నిర్వహణను కూడా ఈ కేంద్రంతో అనుసంధానం చేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు. అమెరికా కేంద్రంగా ఎన్3ఎం సోలుషన్స్ సంస్థను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రుడు ఎన్.మహేష్- యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ సంయుక్తంగా రూపొందించిన లాంగ్ రేంజ్ డ్రోన్ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ తో కలిసి ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ రూపొందించిన డ్రోన్ ఒకే సారి వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఏడున్నర గంటలపాటు నిరాఘాటంగా ప్రయాణించే ఈ డ్రోన్ వ్యవసాయం, వాతావరణం వంటి ముఖ్యమైన అవసరాలకు వినియోగించవచ్చని వెల్లడించారు. 15 కిలోల బరువుండే ఈ లాంగ్ రేంజ్ డ్రోన్ ద్వారా 25 కిలోల బరువును మోయగలిగే సామర్థ్యం ఉంటుంది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగం తో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేసి వివిధ ప్రయోజనాలకు వినియోగించేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Related Posts