"మన్యంపులి", "జనతాగ్యారేజ్", "కనుపాప" లాంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలగు సిని అభిమానుల్ని ఆకట్టుకున్న మళయాల మూవీ లెజెండ్ మోహన్‌లాల్ ఇప్పుడు 'ఓడియన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం తెలుగు హక్కులు దక్కించుకున్న దగ్గుపాటి క్రియేషన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఫ్యాన్సి ఆఫర్ కి బిజినెస్ చేయటం విశేషం. తెలుగులో రామ్ దగ్గుపాటి, సంపత్ కుమార్ లు తెలుగు నిర్మాతలు. దర్శకుడు శ్రీ కుమార్ మీనన్ . ఈ చిత్రం మళయాలంలో అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్‌గా క్రేజ్ ని సొంతంచేసుకోవటమేకాకుండా అన్ని భాషలతో పాటు తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ రావటం మెహన్‌లాల్ గారి స్టామినా ని తెలియజేస్తుంది. ఒడియన్ చిత్రం తెలుగు టీజర్ ని విడుదల చేశారు.. చూసిన వారందరికి మెహన్‌లాల్ గారు మరో వినూత్నప్రయోగంతో ఒడియన్ గా వస్తున్నారనే విషయం తెలుస్తుంది. చాలా ఇంట్రస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 14న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు రామ్ దగ్గుపాటి, సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. "ఈ చిత్రం కోసం మెహన్ లాల్ గారు యెగా మరియు వ్యాయామాలు చేసి తన వయసుని 55 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని నటించిన చిత్రం కావటం.. అద్బుతమైన గ్రాఫిక్స్ తో నిర్మిస్తుండటంతో ఈ క్రేజీ ప్రాజెక్టు కి సౌత్ ఇండియా అంతా హ్యూజ్ క్రేజ్ వచ్చింది. ఇంతటి అవకాశాన్ని అందించిన మెహన్ లాల్ గారికి ,నిర్మాతలకి మా ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రిల్లో డిసెంబర్ 14న విడుదల చేయనున్నారు. మోహన్‌లాల్ గారు చాలా విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు..దర్శకుడు శ్రీ కుమార్ మీనన్ మోహన్ లాల్ గారిని 35 సంవత్సరాల వయసున్న పాత్రలో చూపించనున్నారు. దీనికోసం మోహన్ లాల్ గారు యోగాసనాలు వంటి ప్రక్రియలు 55 సంవత్సరాల వయస్సులో చేయడం హ్యాట్సాఫ్. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఇది పక్కా యాక్షన్ థ్రిల్లర్ కమర్షియల్ ప్యాక్ గా తెరకెక్కింది. ఇటీవల విడుదల చేసిన మెదటి మెదటి లుక్ కి మరియు టీజర్ కి మరింత క్రేజ్ రావటం విశేషం. తెలగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అన్ని చొట్లా బిజినెస్ కావటం విశేషం.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 14న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.." అని అన్నారు.