YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

ఒడిశా రాజకీయాల్లోకి టీడీపీ

 ఒడిశా రాజకీయాల్లోకి టీడీపీ

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కావాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ పై ఒరిస్సా టీవీ సంచలన కధనం ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒడిశా రాజకీయాల పై దృష్టి సారించనున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశా అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు సైతం తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడుతున్నారంటూ కధనం ప్రసారం చేసింది. ఒడిశాను అభివృద్ధి చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న చంద్రబాబు గత నెలలో వరుసగా ఢిల్లీ పర్యటనలు చేసి పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీయేతర నేతలను కలుసుకున్నారు. వారితో కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి దిశగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తమ పొరుగు రాష్ట్రం ఒడిశాలో పోటీ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేయడంపై టీడీపీ దృష్టి సారించింది. టీడీపీ పోటీ చేయాలని ఒడిశాలోని బరంపురం, కటక్‌, రాయగడ, కోరాపుట్‌ ప్రాంతాల తెలుగువారు ఎప్పటినుంచో కోరుతుండటం కలిసొచ్చే అంశంలా కనిపిస్తోంది. అందుకు కారణం 1999 వరదలు. ఆ సమయంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు ఎంతో చొరవ చూపించి ఒడిశా వాసులకు సాయం చేశారు. దీంతో ఆయనపై సానుభూతి ఉండటం సహజం. టీడీపీ పోటీ చేయడంపై ఆ పార్టీ ఒడిశా చీఫ్‌ రాజేశ్‌ పుత్ర మీడియాతో మాట్లాడారు. దాదాపు రెండు దశాబ్దాల కిందటే టీడీపీ ఒడిశా ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండే, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బరిలోకి దిగుతామన్నారు. వీలైతే మొత్తం 147 స్థానాల్లో పోటీ చేస్తామని, లేదా తెలుగు ప్రజల ప్రభావం ఉన్న దాదాపు 50 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నామని రాజేశ్‌పుత్ర వివరించారు. మరోవైపు 2000 మార్చి 5 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ కొనసాగుతున్నారు.2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, తెలుగుదేశం పార్టీ ఒడిశాలో 52 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తుందని ఒడిశా టీడీపీ ఇంచార్జ్ రాజేశ్ పుత్ర తెలిపినట్టు ఒడిశా టీవీ ప్రసారం చేసింది. దక్షిణ ఒరిస్సాలో ఎక్కువగా ఉన్న తెలుగువారు ఉన్న చోట, తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేస్తుందని చెప్తున్నారు. కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజేశ్ తెలిపారు. మొత్తం ఐదు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని, వీటిలో కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్ సభ స్థానాలను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందని, పోటీ చేసే మరో స్థానాన్ని ఎంపిక చేయాల్సి ఉందని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతామని, ఒరిస్సాలో కూడా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని వెళ్తామని ఒడిశా టీడీపీ ఇంచార్జ్ రాజేశ్ పుత్ర పేర్కొన్నారు. ఒడిశాలో పోటీచేసే టీడీపీ అభ్యర్థులను త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేస్తారని వ్యాఖ్యానించారు.తెలుగుదేశం పోటీ పై కాంగ్రెస్ నేత ప్రసాద్ బహినిపాటి స్పందిస్తూ, తెలుగుదేశం కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే, అది అధికార బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీకి చాలా దెబ్బని, ఆ పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీ చీల్చే అవకాసం ఉందని అన్నారు. అయితే అధికార బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ మాత్రం, ఒడిశాలో టీడీపీ ప్రభావం ఉండబోదని తెలిపింది. మరో పక్క బీజేపీ పార్టీ కూడా తెలుగుదేశం పోటీ చేస్తే, మాకు ఇబ్బంది ఉండదని అన్నారు. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సూర్య నారాయణ పాత్రో స్పందిస్తూ, ఇదంతా చంద్రబాబు పొలిటికల్ స్టంట్ అని, మోడీని ఎదుర్కోలేక ఇలాంటివి అన్నీ ప్రచారం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లోనే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదంటూ, మాట్లాడారు. మరో బీజేపీ నాయకుడు భ్రుగు బాక్సిపాత్ర మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. అయితే, ఇవన్నీ ఊహగానాలే, చంద్రబాబు స్పందించే వరకు ఒరిస్సాలో పోటీ పై క్లారిటీ లేదు.

Related Posts