అల్లు అర్జున్.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఒక పెద్ద నిర్మాత కుమారుడు. వీటన్నిటికన్నా మెగా ఫ్యామిలీ హీరో. తాత పెద్ద నటుడు, తండ్రి నిర్మాత, మామయ్యా టాలీవుడ్ మెగా స్టార్.. అయినా తనకంటూ ఒక ప్లాట్ఫామ్ వేసుకుని తెలుగులోనే కాదు ఇతర బాషలలో కూడా ఇమేజ్ ఏర్పర్చుకున్నాడు. తనని మలయాళంలో 'మల్లు అర్జున్' అని ముద్దు గా పిలుచుకుంటారు. లవర్ బాయ్ గా , స్టైలిష్ హీరోగా, మాస్ హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. 2016 లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' చిత్రం తరువాత సరైన సినిమా పడలేదు. ఆఖరిగా వచ్చిన 'డీజే', 'నా పేరు సూర్య నాఇల్లు ఇండియా' చిత్రాలు భారీ పరాజయాలు నమోదు చేసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు దర్శకులు విషయాలలో, కథల విషయాలలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు బన్నీ. స్టోరీ సిట్టింగులకు ప్రత్యేకంగా ఆఫీస్ కూడా తీసుకున్నాడు. మొదట్లో 'మనం', '24' ఫేమ్ విక్రమ్.కే.కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేద్దాం అనుకున్నాడు కానీ ఆ చిత్రం పట్టాలెక్కలేదు. తరువాత చాలా మంది దర్శకులు చెప్పిన కథ విన్నాడు కానీ నచ్చలేదు. తాజాగా తనకు రెండు విజయాలు ఇచ్చిన త్రివిక్రమ్ తో కథ చేయబోతున్నట్లు సమాచారం.. కానీ దీనిపై ఇక క్లారిటీ రాలేదు. మరో వైపు తమ బ్యానేర్ గీత ఆర్ట్స్ కి వరుసగా భారీ విజయాలు ఇచ్చిన 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. చూడాలి తనకి ఏ దర్శకుడు చేపిన కథ నచ్చుతాదో, ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం తన తరువాత చిత్రం అనౌన్స్మెంట్ కి వెయ్యి కళ్ళతో చూస్తున్నారు.