YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పార్లమెంట్ సమావేశాలకు అంతా సిద్ధం

పార్లమెంట్ సమావేశాలకు అంతా సిద్ధం
ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సమావేశాలకు ఒక రోజు ముందుగానే డిసెంబర్ 10వ తేదీన రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్… పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న రోజే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని ఈ సమావేశంలో సుమిత్రా మహాజన్ అన్ని పక్షాలను కోరనున్నారు.వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలివే కానున్నాయి. డిసెంబర్ 11న వెలువడే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ సమావేశాలపై ఉంటుందని భావిస్తున్నారు. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది.ఇప్పటికే ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుత సమావేశాల్లోనే భారత వైద్య మండలి  సవరణ బిల్లును కూడా ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. డిసెంబర్ 11న ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో  ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.  అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష పార్టీలు సమాలోచనలు జరుపుతున్నాయి.  దేశంలోనే అతి పెద్ద రాఫెల్‌ కుంభకోణం, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌ డైరక్టరేట్‌, ఆర్‌బిఐ, ఇతర రాజ్యాంగ సంస్థలపై మోడీ ప్రభుత్వ దాడిని నిలదీసేం దుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుండడంతో పార్లమెంటు ఉభయ సభల్లోను దీనిపై అగ్గి రాజుకోనుంది. ఆర్‌బిఐ అంతర్గత వ్యవహా రాల్లో కేంద్రం తలదూర్చేందుకు ప్రయత్నించ డాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10 వ తేదీ ఉదయం 11గంటలకు అఖిల పక్ష సమా వేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ నెలలోనే ప్రారంభం అవుతాయి. కానీ డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడం ఇది రెండోసారి. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆలస్యమయ్యాయి. 

Related Posts