ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ, స్మార్ట్ గా కనిపిస్తూ ఉండే పశ్చిమగోదావరి డాక్టర్ కాటంనేని భాస్కర్ యంగ్ బోయ్… అంటూ రాష్ట్రభవనాల శాఖామంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కితాబు ఇచ్చారు. విశాఖపట్నం నుండి సోమవారం ఏలూరు జెడ్పీ అతిధి గృహానికి చేరుకొన్న అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వకంగా కలెక్టర్ కలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తో కరచలనం చేస్తున్న డాక్టర్ భాస్కర్ ను ఉద్దేశించి విధి నిర్వహణలో నిత్యం ఎంతో బిజీగా ఉంటూ ఇంత స్మార్ట్ గా ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నించారు. ఎప్పుడూ కనిపించనా జిల్లా అభివృద్దిపై ద్యాసే తప్ప మరో ఆలోచన లేదా అని అయ్యన్న పాత్రుడు అన్నారు. దశాబ్దం క్రితం ఏలూరు సంమీపంలోని వట్లూరు వద్ద చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తికావడానికి కలెక్టర్ కృషి ఎంతో ఉందని 2012 రేట్లకే 2018లో బ్రిడ్జిని పూర్తి చేయించడం లో డాక్టర్ భాస్కర్ ఎంతో కష్టపడ్డారని అయ్యన్న పాత్రుడు చెప్పాడు. ప్రక్కనే వున్న జెడె పి ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు జోక్యం చేసుకొని కలెక్టర్ కృషి వల్ల ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ల డ్రైయినేజ్ పనులు పూర్తి చేసుకోగలగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసన సభ్యులు బడేటి బుజ్జి, పిఠాపురం శాసనసభ్యుడు వర్మ తదితరులు పాల్గొన్నారు.