మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. తన ఆవుకు పుట్టిన కవల దూడలకు కాంగ్రెస్, భాజపా అని పేరు పెట్టాడు. మరి నిత్యం కలహించుకునే ఆ పార్టీల పేర్లను ఈ దూడలకు ఎందుకు పెట్టావ్ అని రైతును అడిగితే ఆయన సమాధానమిదీ..‘గత కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారంలో పార్టీలు చేసే వాగ్దానాలు వింటూనే ఉన్నాం. ఎన్నికల పూర్తయ్యే వరకే ఈ వాగ్దానాలు ఉంటాయి. అందుకే నేను పెంచుకుంటున్న ఆవుకు పుట్టిన కవల దూడలకు భాజపా, కాంగ్రెస్ అని పేరుపెట్టా. భాజపా, కాంగ్రెస్ ఎప్పటికీ కలవవు. కనీసం ఈ కవల దూడలైనా కలిసే ఉంటాయి.. కలిసే పనిచేస్తాయి. అదీకాకుండా ఒక ఆవుకు కవల దూడలకు జన్మనివ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అదీ ఎన్నికల సమయంలో అవి పుట్టడంతో వాటికి ఈ పార్టీ పేర్లు పెట్టాను’ అని చెప్పుకొచ్చాడు సదరు రైతు ధన్ సింగ్.ఎన్నికలనగానే ప్రజల్లో ఒకింత ఆసక్తి ఉండడం సహజం. పల్లెల్లో అయితే అది కాస్త ఎక్కువే. రైతులకు కూడా రాజకీయ పరిజ్ఞానం ఉండదనుకోవడం పొరపాటే.