YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దర్గాలోకి మహిళలను అనుమతి ఫై ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

దర్గాలోకి మహిళలను అనుమతి ఫై ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఢిల్లీలోని ప్రముఖ ముస్లిం పవిత్ర క్షేత్రం నిజాముద్దీన్ దర్గాలోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం ప్రభుత్వాల స్పందన కోరింది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వంతో పాటు నిజాముద్దీన్ దర్గా యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. అయితే శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీం తీర్పు తర్వాతే ఈ కేసును విచారించనున్నట్టు ఢిల్లీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ వి. కామేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది.హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా పవిత్ర క్షేత్రంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ.. పుణేకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్ధినులు గురువారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలోని హజీ అలీ దర్గా, అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాల్లో మహిళలపై నిషేధం లేదనీ... ఈ దర్గాలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం వివక్ష చూపడమేనని పిటిషర్లు ఆరోపించారు.

Related Posts