YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భాజపాయేతర కూటమి ఏర్పాటుకు వేగంగా అడుగులు ఢిల్లీలో 14 భాజపాయేతర పార్టీల నేతలు భేటీ

భాజపాయేతర కూటమి ఏర్పాటుకు వేగంగా అడుగులు        ఢిల్లీలో 14 భాజపాయేతర పార్టీల నేతలు భేటీ
జాతీయ స్థాయిలో భాజపాయేతర కూటమి ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సోమవారం నాడు పద్నాలుగు భాజపాయేతర పార్టీలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,  తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌, ఆప్‌ కన్వీనర్‌, డిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.  బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీకి రాలేదు. భాజపాయేతర కూటమి ఏర్పాటుపై నేతలంతా చర్చించారు. మంగళవారం  నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే మోదీ సర్కార్‌పై మూకుమ్మడి యుద్ధం మొదలుపెట్టాలని యోచిస్తున్న కూటమి నేతలు.. ఆ దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చలు జరిపారు. తరువాత వారు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని  అన్నారు. 

Related Posts