YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లోకసభ ఎన్నికలపై దృష్టి

లోకసభ ఎన్నికలపై దృష్టి
ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు వచ్చే లోక్ సభ ఎన్నికల పై దృష్టి పెట్టారు. అంతేకాదు తమకు వ్యతిరేకంగా జట్టుకడుతున్న విపక్షాలపై కూడా ఒక కన్నేసి ఉంచారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి పరిస్థితులు చక్కబడనున్నాయన్న ఆత్మవిశ్వాసంతో వారున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పే రాష్ట్రం ఏదీ కన్పించడం లేదు. అన్నీ ఎగ్జిట్ పోల్స్ కొంత టైట్ ఫైట్ అనే ఇచ్చాయి. దీంతో వారు భవిష్యత్ కార్యాచరణను సిద్థం చేసేందుకు రెడీ అవుతున్నారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరాం ఎన్నికల ఫలితాలు నెగిటివ్ గా వస్తాయన్న అంతర్గత నివేదికలు, సర్వేలు వారిలో కొంత కంగారు పెట్టినా వచ్చే లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో ఓటమి పాలయినా అది సీఎంల ఖాతాలో వేయడానికి సిద్దమయిపోయారు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరారాజే, రమణ్ సింగ్ లపై నెపాన్ని నెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ఆ పార్టీలో ప్రారంభమయ్యాయి.అందుకే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చైహాన్ పై ఆ పార్టీకి చెందని మాజీ ఎంపీ రఘునందన్ శర్మ విరుచుకుపడ్డారు. ఆయన వల్లనే పది నుంచి పదిహేను సీట్లు తగ్గే అవకాశముందని సంచలన ప్రకటన చేశారు. తానే పెద్ద లీడర్ నని శివరాజ్ సింగ్ చౌహాన్ విర్రవీగడం వల్లనే బీజేపీకి రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందని ఫలితాలకు ముందుగానే విమర్శలు చేయడం దీనికి అద్దంపడుతుంది. బీజేపీ ఓటమి పాలయితే అందుకు శివరాజ్ సింగ్ మాత్రమే కారణమని ఆయన తేల్చి చెప్పడం ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు భావిస్తున్నారు.లోక్ సభ ఎన్నికల నాటికి ఈ మూడు రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కబడతాయని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు. తెలంగాణాలో ప్రజాకూటమి రాకూడదని వారు గట్టిగా ఆకాంక్షిస్తున్నారు. అక్కడ ప్రజాఫ్రంట్ విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంటుందని, లోక్ సభ ఎన్నికలకు ముందే విపక్షాల పొత్తులు ఖరారవుతాయని వారు భావిస్తున్నారు. అందువల్లనే తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చినా పరవాలేదు కాని ప్రజాఫ్రంట్ రాకూడదని వారు గట్టిగా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts