YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాల్యాకు ఇక చుక్కలే

మాల్యాకు ఇక చుక్కలే
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశించింది. దీంతో లిక్కర్ కింగ్ ఇక కష్టాలు ప్రారంభమయినట్లేచెప్పాలి.భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు యూకేలోని వెస్ట్ మినిస్టర్ కోర్టు షాకిచ్చింది. ఆయన్ని భారత్‌కు అప్పగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. రూ.9వేల కోట్ల మేర బ్యాంకులను మోసం చేయడం, మనీ లాండరింగ్‌కు పాల్పడటం వంటి నేరారోపణలున్న మాల్యాపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు 2016లో ఆయన లండన్ పారిపోయారు. దీంతో మాల్యాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్ కోరింది. సుదీర్ఘ విచారణ అనంతరం మాల్యాను భారత్‌కు అప్పగించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై 14 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకొనేందుకు మాల్యాకు కోర్టు అవకాశం ఇచ్చింది. భారత ప్రభుత్వం అభ్యర్థనపై వెస్ట్‌ మినిస్టర్ కోర్టు 2017 డిసెంబరు 4 నుంచి విచారణ జరుపుతోంది. మానవ హక్కులకు సంబంధించిన కారణాలను చూపుతూ మాల్యాను భారతదేశానికి అప్పగించేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ దర్యాప్తు నివేదిక వెల్లడించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చతికిలబడటం అనివార్యమని మాల్యాకు ముందే తెలుసునని, బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ లేదని పేర్కొంది. దీంతో న్యాయస్థానం మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు.  పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా భారత్ లోని బ్యాంకుల నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశారు. రెండేళ్ల క్రితమే ఆయన లండన్ పారిపోయారు. దీంతో ఆయనపై బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. భారత ప్రభుత్వం విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్ కోర్టును కోరింది. గత కొద్ది రోజులుగా భారత్ అధికారులు అక్కడే మకాం వేసి విజయ్ మాల్యాను లండన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2017నుంచి కోర్టులో విజయ్ మాల్యాపై విచారణ జరుగుతోంది. ఎట్టకేలకు సోమవారం విజయ్ మాల్యాను భారత్ కుఅప్పగించాలని ఆదేశించడంతో ఆయన ఇక భారత్ కు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఆర్దర్ రోడ్ జైలు ప్రత్యేకతలు
బ్యాంకులకు వేల కోట్ల రూపాయాల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ్‌ మాల్యా విషయంలో భారత ప్రభుత్వం కీలక విజయం సాధించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై లండన్‌ కోర్టు సోమవారం  కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోర్టు తీర్పు చెప్పింది. అయితే.. తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 14 రోజుల వ్యవధిని మంజూరుచేసింది. అక్కడ కూడా మాల్యాకు చుక్కెదురైతే భారత్ తిరిగి రావాల్సిందే. మాల్యా కోసం అధికారులు ముంబైలోని ఆర్థర్ రోడ్డులో బారక్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. హై ప్రొఫైల్‌ ఖైదీల కోసం వినియోగించే ఈ జైలు ప్రత్యేకతలివే.. విజయ్ మాల్యాను ముంబైలోని ఆర్థర్‌ రోడ్డు జైలు సముదాయంలోని రెండు అంతస్థుల భవనంలో అత్యంత భద్రతతో కూడిన సెల్‌లో ఉంచనున్నారు.
మాల్యాను ఉంచబోయే సెల్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.
ఈ జైలులోని 12వ నంబర్ బారక్‌లో హై ప్రొఫైల్‌ ఖైదీల కోసం ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి.
టీవీ, బెడ్, వ్యక్తిగత వెస్ట్రన్‌ టాయిలెట్‌ ఉంటాయి.
గాలి, వెలుతురు ఉండేలా విశాలమైన ప్రాంతం ఉంటుంది.
ఇదే జైల్లో 26/11 ముంబయి దాడులకు కారకుడైన కరడుకట్టిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉంచారు.
ఆర్థర్‌ రోడ్‌ జైలులోని బారక్‌ నంబరు 12ను భద్రత కారణాల దృష్ట్యా హై ప్రొఫైల్‌ ఖైదీల కోసం వినియోగిస్తున్నారు.
ఈ జైలు గది తలుపు తూర్పు వైపు ఉంటుంది. కావాల్సినంత వెలుతురు వస్తుంది. వెంటిలేషన్‌ కోసం కిటికీలు కూడా ఉంటాయి.
జైలు గది నుంచి బయటకు వెళ్లి నడిచేందుకు కొంత స్థలం కూడా ఉంటుంది.
సీసీటీవీ కెమెరాలు, అదనపు భద్రతా సిబ్బంది ఉంటారు.
నాలుగు సార్లు భోజన సదుపాయం ఉంటుంది.
ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా.. సెల్‌కు దగ్గర్లోనే ఆసుపత్రి కూడా ఉంది.
మిగతా జైలు గదులకు అత్యంత భద్రతతో కూడిన ఈ బారక్స్‌ను వేరుగా ఉంచుతారు.
ఆర్థర్‌ రోడ్డు జైలులో దేశంలోనే మంచి సౌకర్యాలు అందుబాటులో ఉన్న బారక్‌లు ఉన్నాయి.
భారత జైళ్లలో గాలి, వెలుతురు ఉండదని విజయ్‌ మాల్యా ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి కోర్టు జైలు వీడియో పంపాల్సిందిగా సీబీఐని అడిగింది. భారత్‌లోని జైళ్లలో పరిశుభ్రత ఎలా ఉంటుందో చూపించాలని లండన్ కోర్టు కోరడంతో.. ఇక్కడి జైలు పరిశుభ్రత, వైద్య సదుపాయాలను తెలుపుతూ ఇక్కడి అధికారులు ఇప్పటికే వీడియో పంపారు. 62 ఏళ్ల మాజీ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత మాల్యా బెయిల్ మీద లండన్‌లో నివసిస్తున్నారు. రూ.9000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పరారైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించాలని లండన్ కోర్టు ఆదేశించింది.

Related Posts